VIDEO: రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు: MRO

VIDEO: రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు: MRO

MDK: రహదారులపై ధాన్యం ఆరబోసి వాహనదారుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి హెచ్చరించారు. రోడ్లపై వడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కల్లాల వద్దే టార్పాలిన్లు వేసి ధాన్యం ఆరబెట్టాకే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.