కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం

కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం

VZM: చీపురుపల్లి సమీపంలోని అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బీసీ బాలికల వసతిగృహం వద్దనున్న సతీష్ కుమార్‌కు చెందిన పనికిరాని, పాత వస్తువులు కొనుగోలు చేసే దుకాణంలో ఒక్కసారిగా మంటలు రావడంతో లోపల ఉన్న సామాన్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.