రజకపతకం గెలుచుకున్న వెలిగల్లు విద్యార్థి
అన్నమయ్య: వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కౌట్ విద్యార్థి శైలేష్ జాతీయ స్థాయి స్పెల్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం గెలుచుకున్నాడు. ముంబైలో జరిగిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులతో పోటీ పడి ఈ విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం, స్కౌట్ మాస్టర్ మధుకర్ రెడ్డిని అభినందించారు.