'ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్'
KMM: ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగిస్తుందని మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం ముదిగొండ మండలం వెంకటాపురంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గత పదేళ్లలో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.