రేపు దుర్గాదేవి ఆలయంలో లక్ష్మీ పూజ

KDP: అక్షయ తృతీయ సందర్భంగా రేపు కడపలోని విజయదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. తెల్లవారుజామున నిత్య కైంకర్యాల అనంతరం ఉదయం 9 గంటలకు అమ్మవారికి విశేష పూజలు, లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు.