ఓబులదేవర చెరువు బైపాస్ రోడ్డులో ప్రమాదం

ఓబులదేవర చెరువు బైపాస్ రోడ్డులో ప్రమాదం

SS: ఓబులదేవర చెరువు కొత్త బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సీ హాస్టల్ విద్యార్థులు స్కూటీపై రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గాయపడిన వారిని అంబులెన్సులో కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.