డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా కే.రజిత
విశాఖలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరక్టరుగా కే.రజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె విజయనగరం, అనకాపల్లి ప్రాంత డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్గా పని చేసిన విషయం తెలిసిందే. 2013లో ఆమెకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2013 నుంచి 2016 వరకు అసిస్టెంట్ డైరెక్ట్‌గా విధులు నిర్వహించారు.