తగ్గిన కోడిగుడ్ల ధరలు.. ఎక్కడ ఎంత..?
HYD: కోడిగుడ్ల నిల్వలు పెరగడంతో HYDలో అనేక చోట్ల ధరలు గత వారం రోజులతో పోలిస్తే తగ్గినట్లు వ్యాపారులు చెప్పారు. 30 కోడిగుడ్లకు రూ. 120 నుంచి రూ. 150 వరకు నగరంలో ప్రాంతాలను బట్టి హోల్‌సేల్ వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో రూ.130, ఎల్బీనగర్ రూ.140, అత్తాపూర్ వైపు రూ.130, లంగర్ హౌస్ రూ.150, మల్లాపూర్ రూ.150 వరకు ఉంది.