నేటి నుంచి నాగర్ కర్నూల్-శ్రీశైలం లాంచీ యాత్ర ప్రారంభం
NDL: నాగర్ కర్నూల్ జిల్లాలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సోమశిల వద్ద ప్రారంభమై.. శ్రీశైలం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. 6 గంటలపాటు కృష్ణా నదిలో సాగే ఈ యాత్రలో ఇరువైపులా దట్టమైన అడవి, వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు, తీరంలో మత్స్యకారుల గూడారాలు టూరిస్టులకు కనువిందు చేస్తాయి.