ట్రాక్టర్, ఆటో ఢీ.. ఒకరు మృతి
KDP: వల్లూరు మండల పరిధిలోని పైడికాలువ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి రాముడు(40)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వల్లూరు ఎస్సై శివ నాగిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.