'జిల్లాలో 1,44,518 మందికి పింఛన్లు'

PPM: జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనట్లు డీఆర్డీఏ పీడీ వై.సత్యం నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,44,518 మందికి రూ. 96.79 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 3,200 మంది సచివాలయ సిబ్బంది, ఇతర శాఖ అధికారులు పింఛన్లు పంపిణీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.