పర్యాటకమే కాదు.. విద్యలోనూ బాపట్ల టాప్
పర్యాటకంగానే కాకుండా విద్యలో కూడా బాపట్ల జిల్లా ప్రఖ్యాతి. దక్షిణ భారతదేశపు అత్యంత పురాతన వ్యవసాయ కళాశాల ఇక్కడే ఉంది. 1945లో స్థాపించగా.. వ్యవసాయ విద్యకు కాశీగా పేరుగాంచింది. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగాత్మక క్షేత్రాలు, అత్యాధునిక ల్యాబ్‌లు ఇక్కడ ఉన్నాయి. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను అందించిన ఘనత ఈ కళాశాలకే దక్కుతుంది.