వేసిన నెలకే పెచ్చులూడుతున్న రోడ్డు
KKD: జిల్లాలోని పత్తిపాడు మండలం మేడిచర్ల-పులిగోగుల వరకు వేసిన రోడ్డును కాంట్రాక్టర్ నిర్వాహకం వల్ల నాసిరకంగా నిర్మించారని స్థానిక గిరిజనులు పేర్కొంటున్నారు. కాలితో తన్నినా, చేత్తో లాగినా పెచ్చులు ఊడి వచ్చేస్తున్నాయంటున్నారు. గిరిజనాభివృద్ది శాఖ నుంచి కోట్ల రూపాయల ఖర్చు చేసి నిర్మించారని, రోడ్డు వేసిన నెలరోజులకే ఇలా అవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.