వింత వ్యాదితో మేకలు మృతి

NLR: మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడు పల్లి గ్రామంలో గత 20 రోజుల నుంచి అంతుచిక్కని వ్యాధితో మేకలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో వ్యాధి ఏమిటో, మందులు ఏమిటో అర్థంకాక మేకల కాపరులు లబోదిబోమంటున్నారు. వారం రోజుల నుంచి ఇప్పటి వరకు గ్రామంలో 10కి పైగా మేకలు వాటి పిల్లలు మృతిచెందాయి. దీంతో వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోందని కాపారులు చెపుతున్నారు.