పవన్ కుమారుడి కోసం ఆలయంలో పూజలు

SKLM: జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంఛార్జ్ విశ్వక్‌సేన్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదానికి గురైన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రంగస్థలంలో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా మారి పవన్ కుటుంబం ఈ కష్టం నుంచి త్వరగా బయట పడాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.