ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
MNCL: లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అధికారి సరోజ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.