శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలం

శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలం

ఖమ్మం జిల్లాలో ఏర్పడ్డ శాంతిభద్రతల పరిస్థితులపై BRS జిల్లా అధ్యక్షుడు, MLC తాతా మధుసూదన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు భయంతో జీవిస్తున్నారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. ఖమ్మం జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు.