'వెంకటకృష్ణారావు సేవలు అనిర్వచనీయం'
కృష్ణా: దివిసీమ ఉప్పెన సమయంలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు అనిర్వచనీయమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇవాళ అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జరిగిన ఉప్పెన మృతుల సంస్మరణ సభలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. 1977వ సంవత్సరంలో దివి సీమ ఉపెన కారణంగా 14వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.