నగరంలో ఆక్రమణల తొలగింపు
KMM: నగరంలోని ఫుట్ పాత్, డ్రెయినేజీలను ఆక్రమించి ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులు, డబ్బాలు, బండ్లను కేఎంసీ సిబ్బంది తొలగించారు. కేఎంసీ ఏసీపీ వసుంధర, ఉద్యాన అధికారిణి రాధిక ఆధ్వర్యాన టౌన్ ప్లానింగ్, DRF సిబ్బంది గట్టయ్య సెంటర్ నుంచి స్టేడియం వరకు, మయూరి సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించారు. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.