VIDEO: కోతకు గురైన ప్రధాన రహదారులు
WGL: మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయపర్తి మండలంలోని పలు గ్రామాల ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా బురహాన్పల్లి-కాట్రపల్లి రోడ్డు మార్గం తీవ్ర కోతకు గురై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు శనివారం డిమాండ్ చేశారు.