రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

ఖమ్మం: చర్ల మండలం లింగాపురంపాడులో శనివారం శ్రీరామచంద్రస్వామి వారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అర్చకులు వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేద పండితులు హోమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. భక్తుల సహాయ సహకారాలతో పునర్నిర్మించే ఈ ఆలయానికి 150 సంవత్సరాల చరిత్ర ఉందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత్, నవీన్, ప్రవీణ్, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.