అర్జీలు స్వీకరించిన కలెక్టర్
ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలు పరిష్కరించాలని యంత్రాంగాన్ని కోరారు.