'6 నెలల్లో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తి'
GNTR: రాజధాని పరిధిలోని గ్రామాల్లో వచ్చే ఆరు నెలల్లోగా మౌలిక సదుపాయాల పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధాని నిర్మాణంతో సమానంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. జరీబు, నాన్-జరీబు భూములు, రోడ్డు పోటు ప్లాట్ల వంటి రైతుల వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తామన్నారు.