'సీఎం ఆధిపత్య అహంకారానికి దళిత స్పీకర్ బలవుతున్నారు'
HYD: సీఎం రేవంత్ రెడ్డి ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ బలవుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, హైకోర్టుతో ఆ దళిత స్పీకర్‌కు ఎందుకు మొట్టికాయలు అని ప్రశ్నించారు. సీఎం ఒత్తిడికి, ఆధిపత్య అహంకారానికి స్పీకర్ కుర్చీకి ఉన్న పవిత్రతను ఉల్లంఘించొద్దని విజ్ఞప్తి చేశారు.