విద్యార్థినిలకు సానిటరీ ఫ్యాడ్స్ పంపిణీ

విద్యార్థినిలకు సానిటరీ ఫ్యాడ్స్ పంపిణీ

WGL: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ ఆధ్వర్యంలో బుధవారం చెన్నారావుపేట మండలంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 'నారీ మహిళా ఆరోగ్య సంకల్పం' లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు బండి పద్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు.