పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

JGL: పెగడపల్లి మండలంలోని ఐతిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో, 2006-07సంలో పదవతరగతి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు తాము చదువుకున్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కలుసుకొన్నారు. తాము చదువుకొని సుమారు 17సంవత్సరాల తర్వాత తమ యొక్క పాత జ్ఞాపకాలను నెమరువేసుకొన్నారు. అనంతరం గురువుగార్లను శాలువాతో సత్కరించారు.