VIDEO: జిల్లాలో గ్రామపంచాయతీ పోలింగ్ ప్రారంభం

VIDEO: జిల్లాలో గ్రామపంచాయతీ పోలింగ్ ప్రారంభం

జనగామ జిల్లా జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మేట్ట, తరిగొప్పుల మండలాల్లో ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసులు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు.