మానవత్వాన్ని చాటుకున్న ఎంపీ ఈటెల

మానవత్వాన్ని చాటుకున్న ఎంపీ ఈటెల

KNR: హుజురాబాద్ పర్యటన ముగించుకుని హన్మకొండకు వెళ్తుండగా, మార్గమధ్యంలో ఒక ఆటో బోల్తా పడటం గమనించిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయన ప్రదర్శించిన ఈ చొరవ ఆయనలోని మానవత్వాన్ని, సామాజిక బాధ్యతను చాటిచెప్పింది.