4 గంటల్లోనే ధాన్యం డబ్బులు: మంత్రి నాదెండ్ల
తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం రాజానగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ. 430 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 4 గంటల్లోనే నగదు చెల్లిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.