ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని కాలం రాజుపేటలో గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ పుష్పాంజలి మాట్లాడుతూ.. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9:30 లోపు సాయంత్రం నాలుగు తర్వాత పనులు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రోగులను తనిఖీ చేసే మందులు పంపిణీ చేశారు.