'లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి'

'లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి'

WNP: ఈనెల 15 శనివారం నాడు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాల మధ్య పరస్పర అవగాహనతో పరిష్కారం కనుక్కోవడం వల్ల సమయం, ధనం, శ్రమ ఆదా అవుతుందని తెలిపారు. రాజీ ద్వారా అందరికీ న్యాయం త్వరగా లభిస్తుందని పేర్కొన్నారు.