మాజీ ఆర్మీ ఉద్యోగి మృతికి సంతాపం

మాజీ ఆర్మీ ఉద్యోగి మృతికి సంతాపం

NLG: నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి, సినీ నిర్మాత బెల్లి జనార్ధన్ యాదవ్ ప్రమాదవశాత్తు మరణించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మిత్రుడిని కోల్పోవడం బాధాకరమంటూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి ఉన్నారు.