చిత్ర లేఖనంతో స్వాతంత్య్ర స్పూర్తి

కోనసీమ: మండపేట శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీ విద్యార్థులు చిత్ర లేఖనంతో స్వాతంత్ర స్పూర్తి కలిగించారు. విద్యార్థులు వంకల శివలీల, రామిశెట్టి మౌనిక, ఆర్.చక్రిలు అబ్బుర పరిచే చిత్రాలు తీర్చిదిద్దారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలర్ పెన్సిల్స్ ఆయిల్ పాస్టల్స్ ఉపయోగించి చిత్రపటాలను రూపొందించారు. దేశ గొప్పతనాన్ని చాటే భరత మాత బొమ్మను రూపొందించారు.