రైతుల కోసమే భూభారతి చట్టం: ఆర్డీవో

SRD: రైతుల కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో సదస్సులు జరుగుతాయని పేర్కొన్నారు.