గోకులాలను పరిశీలించిన కలెక్టర్

గోకులాలను పరిశీలించిన కలెక్టర్

NTR: 2018-19 సంవత్సరంలో మెగా గోకులాల పేరిట నిర్మాణం చేపట్టిన సామాజిక పశువుల చావిడిలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగ్గయ్యపేట మండలం బండిపాలెం, పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయి గూడెంలలోని సామాజిక పశువుల చావిడిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలసి పరిశీలించారు.