వైన్ షాపుల్లో చోరీ.. దొంగ అరెస్ట్

వైన్ షాపుల్లో చోరీ.. దొంగ అరెస్ట్

నల్గొండ: వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ బిస్త్ రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ, ఎస్ఐ మధు తెలిపారు. అక్టోబర్ 10న గుర్రంపోడు మండలంలోని ఆదిత్య వైన్స్‌లో రూ.10.8 లక్షల నగదు చోరీకి గురైంది. యజమాని నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితున్ని పట్టుకున్నారు.