అక్రమ కట్టడాలపై ముగ్గురు అధికారులకు చర్యలు

కృష్ణా: తాడిగడపలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేకపోయారని ముగ్గురు అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. రాజమండ్రి రీజినల్ డైరెక్టర్ ద్వారా విచారణ జరిపించగా, అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ మురళీగౌడ్, సూపర్ వైజర్ పద్మావతి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది.