సైబర్ కేటుగాళ్ల కొత్త అస్త్రం 'డిజిటల్ అరెస్ట్': ఏసీపీ

సైబర్ కేటుగాళ్ల కొత్త అస్త్రం 'డిజిటల్ అరెస్ట్': ఏసీపీ

కృష్ణా: సైబర్ కేటుగాళ్ల సరికొత్త అస్త్రం 'డిజిటల్ అరెస్ట్' అని సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. బుధవారం సాయంత్రం అయిన మీడియాతో మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి మీరు 'డిజిటల్ అరెస్ట్' అయ్యారని అంటే బెదరకండన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయాలని సూచించారు. చట్టప్రకారం ఏ నేరంలో నైనా 'డిజిటల్ అరెస్ట్'లు ఉండవని పేర్కొన్నారు.