కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
HNK: ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మంగళవారం పరిశీలించారు. ఐనవోలు మండలం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.