VIDEO: విద్యుత్ తీగలకు షార్ట్ సర్క్యూట్.. తప్పిన ప్రమాదం

VIDEO: విద్యుత్ తీగలకు షార్ట్ సర్క్యూట్.. తప్పిన ప్రమాదం

ATP: గుత్తి మండలం జక్కలచెరువు ఎన్టీఆర్ కాలనీలో రోడ్డులో వేలాడుతున్న విద్యుత్ తీగలకు బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాలనీవాసి రమేష్ మాట్లాడుతూ.. కాలనీలో విద్యుత్ స్తంభాలు లేక విద్యుత్ తీగలను రోడ్డు మధ్యలో వేలాడుతున్నాయన్నారు. అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు.