అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని: కలెక్టర్

SKLM : జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సమీక్షా సమవేశం నిర్వహించారు. వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.