19 నుంచి హనుమత్ జయంతి ఉత్సవాలు

NLR: దర్గామిట్టలోని శబరి శ్రీరామ మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 19-22వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 19న అంకుర్పారణ, 20, 21 తేదీల్లో అభిషేకాలు, హోమాలు జరుగుతాయన్నారు. 22న హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి విశేషాభిషేకాలు, 9 గంటలకు హోమాలు, 10 గంటలకు లక్షమల్లె అర్చన జరుగుతుందిని తెలిపారు.