ఈ నెల 30న ఉచిత కంటి శిబిరం

ఈ నెల 30న ఉచిత కంటి శిబిరం

నాగర్కర్నూల్ జిల్లా పాత కలెక్టరేట్‌లో ఈనెల 30న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అధికారి బాలాజీ తెలిపారు. దృష్టి లోపాలు, శుక్లాల సమస్యలతో బాధపడుతున్న వారు ఆధార్ నకలు, బీపీ, షుగర్ రిపోర్టులతో హాజరుకావాలని సూచించారు. అవసరమైన వారికి పరీక్షలు, చికిత్స అందిస్తామని తెలిపారు. వివరాలకు 9440876556, 7386940480 నంబర్లను సంప్రదించాలని కోరారు.