పెదనందిపాడులో తప్పిన పెను ప్రమాదం

పెదనందిపాడులో తప్పిన పెను ప్రమాదం

GNTR: పెదనందిపాడు మండలం వరగాని సమీపంలోని రైతన్న కోల్డ్ స్టోరేజ్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమ్మూరు నుంచి గుణదల వెళుతున్న టాటా మ్యాజిక్ ఆటోను, గుంటూరు నుంచి వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో పల్టీ కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏ అపాయం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.