సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MDK: నిరుపేదల వైద్యం కోసం సీఎం సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని ఇద్దరు లబ్ధిదారులు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా వారికి 42,500 నిధులు మంజూరయ్యాయి. నేడు బాధితులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.