ఎర్రగొండపాలెంలో సమ్మర్ క్యాంప్

ఎర్రగొండపాలెంలో సమ్మర్ క్యాంప్

ప్రకాశం: వేసవిలో పిల్లలకు విద్యతో పాటు విజ్ఞానం అందించేందుకు విజ్ఞాన తరగతులు ఉపయోగపడతాయని ఎర్రగొండపాలెం ఎంఈఓ పి. ఆంజనేయులు అన్నారు. సోమవారం ఎర్రగొండపాలెం గ్రంథాలయంలో గ్రంథ పాలకురాలు కె.ఝాన్సీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ తరగతులు మే 6 వరకు కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.