నాణ్యతా ప్రమాణాలు మరిచి బిల్లుల కోసం వాగ్వాదం
కర్నూలు నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల నాణ్యతపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి టీజీ భరత్ ఆదేశాలను పట్టించుకోకుండా కొందరు కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేసినట్టు సమాచారం. దీనిపై కమిషనర్ విశ్వనాథ్ నోటీసులు జారీ చేసి, బిల్లులను నిలిపేయడంతో కాంట్రాక్టర్లు మంత్రి సమక్షంలో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.