ఉపాధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో

KDP: చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో కుళాయి బాబు గురువారం పరిశీలించారు. మస్టర్ను తనిఖీ చేశారు. 'ఉదయం 6 గంటల నుంచి 11లోపు పని ముగించుకోవాలి. కనీస వేతనం రూ. 307కు తక్కువ కాకుండా కొలతల మేరకు పనులు చేపట్టాలి' అని వేతనదారులకు ఎంపీడీవో కుళాయి బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీ అన్నా నాయక్, టీఏ మహమ్మద్ అలీ పాల్గొన్నారు.