కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం పర్యటనపై సమీక్ష సమావేశం

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గానికి ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన సీఎం పర్యటన విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. రూ.800కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రగతిని సమీక్షించారు.