రైల్వే నాలుగో లైన్ పై రైతులు వ్యతిరేకత
VZM: కొత్తవలస నుంచి విజయనగరం వరకు చేపటనున్న రైల్వే నాలుగో లైన్ పై మంగళవారం నిమ్మలపాలెం గ్రామంలో గ్రామసభను నిర్వహించారు. ఈమేరకు రైల్వే ఇస్తున్న నష్ట పరిహారం సరిపోదని గ్రామస్తులు వ్యతిరేకించారు. పరిహారాన్ని పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గొంప కృష్ణమూర్తి, సర్పంచ్ కొట్యాడ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.